గిరిజన విశ్వవిద్యాలయం బిల్లును ప్రవేశపెట్టాలని మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాంనాయక్ డిమాండ్ చేశారు. కేంద్ర బృంద పరిశీలించి ఏళ్లు గడిచినా ఇంతవరకు నిర్మాణం ప్రారంభించకపోవడం కేంద్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.
యూనివర్సిటీ ఏర్పాటు-కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అనే ఆంశంపై గిరిజన శక్తి రాష్ట్రకమిటీ ఆధ్వర్యంలో వరంగల్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ సీతారాంనాయక్తోపాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ములుగు జిల్లా జాకారం వద్ద విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 335 ఎకరాలు కేటాయించిందని మాజీ ఎంపీ అన్నారు. యూనివర్సిటీ ఏర్పడితే గిరిజన భాష, కళలు, జీవన విధానం, అడవి, సంస్కృతి ,చరిత్రలపై ఉన్నతమైన పరిశోధన విద్యనందుకోవచ్చని తెలిపారు.
పార్లమెంటు సమావేశాల్లో గిరిజన విశ్వవిద్యాలయం బిల్లు ప్రవేశపెట్టకపోతే పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. యూనివర్సిటీ సాధించేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో భృతి: కేటీఆర్