కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనలు చెందవద్దని కోరారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆటో డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. వారం రోజులకు సరిపడే బియ్యం, పప్పు, నూనె తదితర వస్తువులను అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలని... భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: పెళ్లి కోసం 850కి.మీ సైక్లింగ్- ముహూర్తం టైమ్‌కు క్వారంటైన్