లోక్సభ ఎన్నికల్లో వరంగల్ స్థానంలో తెరాసను అధిక మెజార్టీతో గెలిపించాలని తెరాస నేత, పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలను కోరారు. వరంగల్ లోక్సభ అభ్యర్థి పసునూరి దయాకర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయన్నారు. రెండు లోక్సభ సీట్లతోనే కేసీఆర్ తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. 16 స్థానాల్లో విజయం సాధించి సీఎం దిల్లీని శాసిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి :నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద బారులు తీరిన రైతులు