తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే దివ్యాంగులకు సరైన గుర్తింపు లభించిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని మల్లికంబా మనోవికాస కేంద్రంలో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో మంత్రి దయాకర్ రావు పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మానసిక దివ్యాంగులకు తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు.
ఆర్ధికంగా ఉన్నవారు ఇలాంటి మానసిక దివ్యాంగులను ఆదుకోవాలని సూచించారు. గతంలో 8 కేటగిరీలలో ఫించన్లు వచ్చేవారని...కానీ ఇప్పుడు 21 కేటగిరీల వారికి ఫించన్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. మల్లికంబా మనోవికస కేంద్రానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: బంగారు టాయ్‌లెట్‌ను దొంగలెత్తుకెళ్లారు..!