తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్లో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె చేసేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు.
అందులో భాగంగా.. హన్మకొండలోని విద్యుత్ ఏస్ఈ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు నిరాహార దీక్షలు చేపట్టారు. ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. సబ్ స్టేషన్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే.. పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.