ETV Bharat / state

కరోనాపై యుద్ధానికి... విరాళాల వెల్లువ

కరోనా మహమ్మారిపై పోరుకు సినీ, రాజకీయ ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తాజాగా తెరాసకు చెందిన రాజ్యసభ ఎంపీ బండా ప్రకాశ్‌ ఎంజీఎం ఆసుపత్రికి కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. అదేవిధంగా ఎంపీ పసునూరి దయాకర్‌ 5కోట్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 50లక్షల రూపాయలను సీఎం సహాయనిధికి విరాళంగా అందించారు.

Donations to CM Relief Fund to reduce corona in Telangana State
కరోనాపై యుద్ధానికి... విరాళాల వెల్లువ
author img

By

Published : Mar 27, 2020, 12:56 PM IST

కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి కరోనా లక్షణాలతో వచ్చి చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఈ క్రమంలో కోవిడ్ 19 వార్డుకు అవసరమయ్యే పరికరాలు, మందుల కొనుగోలుకు రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ తన ఎంపీల్యాడ్స్‌ నిధుల నుంచి కోటి రూపాయలను విరాళంగా అందజేశారు.

రోగులకు సేవలందించేందుగాను వైద్యులు అవసరమైన కిట్లు, ఇతర వస్తువుల పరికరాల కోసం నిధులను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా ఎంపీ పసునూరి దయకర్‌ 5కోట్ల రూపాయలు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 50లక్షల రూపాయలను సీఎం సహాయనిధికి విరాళంగా అందించారు.

ఇదీ చూడండి: నిబంధన అతిక్రమిస్తే చలానా ఇంటికొస్తుంది: డీజీపీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.