ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పొరుగు జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించి, కానుకలు సమర్పించారు. అధికంగా భక్తులు తరలిరావడం వల్ల సుమారు రెండు గంటలపాటు క్యూలైన్లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రావణ శుక్రవారంతో పాటు మూడు రోజులు వరస సెలవులు కలిసి రావడం వల్ల ఈ ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిందని ఆలయ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: రేపటి నుంచి యాదాద్రిలో పవిత్రోత్సవాలు