Cybercrime in Hanmakonda : ఎవరెంతగా చెప్పినా, అవగాహన కల్పించినా సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. అధిక డబ్బును సంపాదించవచ్చుననే ఆశతో మోసగాళ్ల బారిన పడి పలువురు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ తరహా ఘటన తాజాగా హనుమకొండలో చోటు చేసుకుంది. విమాన టిక్కెట్ల బుకింగ్ ఏజెన్సీ పేరుతో ఓ వ్యక్తి మోసం చేసి రూ. 37 లక్షలు కాజేసిన ఘటన పట్టణంలోని పెద్దమ్మగడ్డలో జరిగింది.
'ఐ'రేంజ్ మోసం - హోల్‌సేల్ ధరలో ఫోన్లు కావాలంటూ నట్టేట ముంచిన వ్యక్తి అరెస్ట్
పెద్దమ్మగడ్డకు చెందిన ఓ యవకుడికి విమాన టిక్కెట్ ఏజెన్సీ ఇస్తామని, పార్ట్ టైం చేసినా లక్షలాది రూపాయలు సంపాదించవచ్చంటూ ఓ వ్యక్తి టెలిగ్రాం యాప్ ద్వారా సందేశం పంపించాడు. ఇదంతా నిజమని నమ్మిన ఆ యువకుడు రూ 37.59 లక్షల రూపాయలను అతని ఖాతాలోకి జమ చేశాడు. ఆ తరువాత ఫోన్ చేస్తే సదరు వ్యక్తి నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఫోన్ స్విచాఫ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన యువకుడు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Cybercrime in the name of Air Ticket : ఇటువంటి మరో ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది. విదేశాలకు వెళ్లేందుకు విమానం టికెట్లు బుక్ చేస్తానని చెప్పి మోసం చేసిన మరో ఘటన హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. లష్కర్ సింగారానికి చెందిన విద్యార్థి బంధువులు కెనడాకు వెళ్లేందుకు విమానం టికెట్లు బుక్ చేసుకునే క్రమంలో చెన్నైకి చెందిన కల్యాణ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతను ప్రైవేటు విమాన సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నానని చెప్పి సదరు విద్యార్థిని నమ్మించాడు.
'నీ పెళ్లికి పెట్టిన ఖర్చులు తిరిగిచ్చేయ్' - అన్నా వదినల వేధింపులతో యువకుడి ఆత్మహత్య
టికెట్ బుక్ చేస్తానని చెప్పి విద్యార్థి నుంచి రూ.2.35 లక్షల ఆన్‌లైన్ ద్వారా తీసుకుంటాడు. ముందుగా టికెట్ బుక్ చేసి విద్యార్థికి వివరాలు తెలియజేశాడు. తర్వాత సీట్ల నెంబర్ కోసం విద్యార్థి ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌కు వెళ్లి తనిఖీ చేయగా టికెట్స్ రద్దు చేసినట్లు ఉంది. దీంతో కల్యాణ్ చేతిలో మోసపోయినట్లు గుర్తించి హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అన్‌లైన్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నగదు పంపించేముందు సమగ్రంగా విచారించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
"హనుమకొండ పట్టణానికి చెందిన ఓ యవకుడికి విమాన టిక్కెట్ ఏజెన్సీ ఇస్తామని ఓ వ్యక్తి టెలిగ్రాం యాప్ ద్వారా సందేశం పంపించాడు. ఇది నిజమని నమ్మిన ఆ యువకుడు రూ. 37.59 లక్షల రూపాయలను అతని ఖాతాలోకి జమ చేశాడు. ఆ తరువాత ఫోన్ చేస్తే సదరు వ్యక్తి నుంటి ఎలాంటి సమాధానం లేదు. ఫోన్ స్విచాఫ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్‌లైన్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నగదు పంపించేముందు సమగ్రంగా విచారించుకోవాలి". - కరుణాకర్, హనుమకొండ సీఐ
అబ్బాయిలూ కి'లేడీ'లతో జాగ్రత్త - క్యూట్‌గా అడిగిందని లిఫ్ట్ ఇచ్చారో అంతే సంగతులు