రాష్ట్రంలో ఎక్కడ చూసినా చెరువులు, కుంటలు, దేవాదాయ, వక్ఫ్ బోర్డులు భూములు కబ్జాకు గురయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సర్వే నెంబర్ వారీగా వీటిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వక్రబుద్ధితో మంచిగా ఉన్న సచివాలయాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వ విద్యపై కక్ష గట్టి పేదోళ్లకు చదువును దూరం చేసేలా... ప్రైవేటు విశ్వవిద్యాలయాలను తీసుకువస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు వీసీలనే నియమించలేదని తెలిపారు. ఈనెల 22 నుంచి 24 వరకు మంచిర్యాలలో సీపీఐ రాష్ట్ర మహసభల నిర్వహించనున్నామని... వీటిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి : కేటీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకునేనా?