వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండలో పబ్లిక్ గార్డెన్ లో ఉన్న పాము పుట్ట వద్దకు తెల్లవారుజాము నుంచే మహిళలు చేరుకుని నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. కరోనా నేపథ్యంలో భక్తులందరూ విధిగా మాస్కులు ధరించి వచ్చారు. పుట్టలో పాలు పోసి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. నాగదేవతకు కానుకలు సమర్పించి దీపారాధన చేశారు.
మహిళలు అధిక సంఖ్యలో రాగా.. అధికారులు వారిని భౌతిక దూరం పాటిస్తూ పూజలు నిర్వహించాలని కోరారు. కొందరు నిర్లక్ష్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోగా..పూజ చేసేందుకు అధికారులు పుట్ట వద్దకు అనుమతించలేదు.
ఇదీ చదవండిః కొవిడ్ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే