రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వరంగల్ అర్బన్ జిల్లాలోని కేంద్ర కారాగారంలో ఖైదీలను చూసేందుకు వెసులు బాటు కల్పించే ములాఖాత్ రద్దు చేస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ మురళిబాబు తెలిపారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. జైలు ప్రధాన గేటు వద్ద ములాఖాత్ లేదంటూ బోర్డును ఏర్పాటు చేశారు. తదుపరి ఉత్తర్వులు అనంతరం ములాఖాత్ దక్కుతుందని మురళిబాబు తెలిపారు.
ఇవీ చదవండి: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు