వరంగల్లోని రుద్రమదేవి కూడలి వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టాయి. ఈ దీక్షలో అర్బన్ జిల్లా, గ్రామీణ జిల్లాకు చెందిన నేతలు పాల్గొన్నారు. దేశంలో మహిళలపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని వాటిని నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారు ఆరోపించారు.
మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు అమలు చేయకపోవడం వల్లే తరచుగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని మండిపడ్డారు. మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన నిర్భయ చట్టం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని విమర్శించారు.
ఇదీ చదవండి: శాంతి భద్రతలపై ఈ నెల 7న సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం