ETV Bharat / state

TRS vs Farmers: సభకు పొలాలు ఇవ్వమన్నందుకు రైతులపై తెరాస నాయకుడు దాడి

విజయ గర్జన భారీ సభ కోసం స్థలాన్ని పరిశీలించేందుకు కొందరు తెరాస ఎమ్మెల్యేలు(TRS vs Farmers in devannapet) వెళ్లారు. చుట్టూ పరిశీలిస్తున్న సమయంలో స్థానిక రైతులు వచ్చారు. సభ కోసం తమ పంట పొలాలు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యేలు సైలెంట్​గా వెనుదిరిగారు. కానీ అక్కడున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజీ పడలేదు. ఎందుకివ్వరంటూ రైతులతో వాగ్వాదానికి దిగారు. చుట్టూ పోలీసులు ఉన్నారనే భయం కూడా లేకుండా ఓ కార్యకర్త(TRS vs Farmers in devannapet) .. అక్కడే ఉన్న ఓ వ్యక్తిపై చేయి కూడా చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా దేవన్నపేటలో కనిపించిన దృశ్యాలివి.

TRS vs Farmers in devannapet
తెరాస నాయకులకు రైతులకు వాగ్వాదం
author img

By

Published : Nov 3, 2021, 10:26 PM IST

ఈనెల 29న తెరాస చేపట్టిన విజయ గర్జన భారీ సభ కోసం భూమి పరిశీలించేందుకు వెళ్లిన నాయకులకు(TRS vs Farmers in devannapet) చేదు అనుభవం ఎదురైంది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట(TRS vs Farmers in devannapet) లో తెరాస నాయకులు, రైతులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. స్థానిక తెరాస కార్పొరేటర్ దివ్యరాణి భర్త రాజు నాయక్ ఓ వ్యక్తిపై పోలీసుల సమక్షంలోనే దాడి చేశాడు.

దేవన్నపేటలో తెరాస నాయకులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం

పొలాలు ఇచ్చేది లేదని

తెరాస పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా వరంగల్‌లో విజయ గర్జన సభ నిర్వహించేందుకు అధిష్ఠానం(TRS vs Farmers in devannapet) నిర్ణయించింది. ఈ మేరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, తెరాస నాయకులు దేవన్నపేటలో సభా స్థలి పరిశీలన కోసం అక్కడకు వెళ్లారు. అయితే దేవన్నపేట శివారులోని పంట పొలాలతో పాటు ఖాళీ ప్రదేశాన్ని చూస్తున్న ఎమ్మెల్యేల వద్దకు స్థానిక రైతులు చేరుకున్నారు. సభ కోసం మా పొలాలను ఇచ్చేది(TRS vs Farmers in devannapet) లేదని రైతులు అందోళనకు దిగారు. దీంతో ఎమ్మెల్యేలు వెనుదిరిగారు.

కార్పొరేటర్​ భర్త దాడి

ఈ క్రమంలో అక్కడ ఉన్న తెరాస నాయకులు, స్థానిక కార్పొరేటర్ భర్త రాజు నాయక్(TRS vs Farmers in devannapet) రైతులతో గొడవకు దిగారు. పంట పండే పొలాలను ఎలా ఇస్తామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ పెద్దగా కావడంతో రాజు నాయక్ అక్కడ ఉన్న ఓ వ్యక్తిపై దాడి చేశాడు. పోలీసుల సమక్షంలోనే రాజు నాయక్ దాడికి పాల్పడ్డాడు. పోలీసులు నచ్చజెప్పి వారిని అక్కడి నుంచి పంపించారు. సభకు పంట పొలాలను ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి: Jagga Reddy : 'దీపావళి పండుగపై ఒట్టేసి చెబుతున్నా.. అలాంటి వ్యాఖ్యలు చేయను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.