ETV Bharat / state

గ్రేటర్​ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయం: ప్రభుత్వ చీఫ్​ విప్​

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయ్​భాస్కర్​ అన్నారు. గ్రేటర్​ ఎన్నికల్లో తెరాస విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

chief whip vinay bhaskar review on ghmc elections in warangal
గ్రేటర్​ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయం: ప్రభుత్వ చీఫ్​ విప్​
author img

By

Published : Nov 20, 2020, 8:38 PM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించడం ఖాయమని ప్రభుత్వ చీఫ్​ విప్ వినయ్​భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. హన్మకొండలో నిర్వహించిన సన్నాహ‌క స‌మావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో తెరాస చేప‌ట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం, ప్ర‌తిప‌క్షాల అస‌త్య ప్ర‌చారాల‌ను తిప్పికొట్ట‌డంపై స‌మావేశంలో చ‌ర్చించారు. తెరాస తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించేందుకు పార్టీ శ్రేణులు శ్రమించాలని సూచించారు.

అంకితభావంతో పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని వివరించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: గ్రేటర్ ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.