వరంగల్ పట్టణ జిల్లా కాజిపేట దర్గాలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మండల కేంద్రాలలో ఈ దినోత్సవం నిర్వహిస్తోందని చీఫ్ విప్ తెలిపారు.
ఎక్కడైనా తమ హక్కులకు భంగం వాటిల్లినా, ప్రభుత్వ కార్యాలయాల్లో రోజుల తరబడి పనులు జరగకపోయినా, ఈ అవగాహన సదస్సులో రాతపూర్వకంగా తెలపవచ్చని అన్నారు. ఇక్కడ అందిన ఫిర్యాదులకు ప్రభుత్వ అధికారుల నుంచి జవాబుదారితనం ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
దర్గా ప్రాంతానికి చెందిన దీప అనే గృహిణి భర్త చనిపోయి ఇద్దరు పిల్లలను పెంచడానికి ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నానని తెలిపింది. ప్రభుత్వ పరంగా ఆమెకు రాయితీ రుణ సహాయం, ఇద్దరు పిల్లల చదువుకు ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకునేందుకు ఆమెకు తగిన శిక్షణ అందించాలని మెప్మా పీడీ కృష్ణవేణికి చీఫ్ విప్ సూచించారు.
ఇదీ చూడండి : మేడారం జాతర నాడు నేడు