ఉద్యమాలు, ఉద్యమ ఆకాంక్షలు తెలియని బండి సంజయ్ కేసీఆర్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సంజయ్.. ఓరుగల్లు గడ్డపై అడుగుపెట్టగానే కనీసం అమరవీరుల స్థూపానికి నివాళులు కూడా అర్పించలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఉద్యమ నేత కేసీఆర్ ప్రాణత్యాగానికైనా సిద్ధపడి.. పోరాటం చేసిన సమయంలో భాజాపా నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడంటే కేసీఆర్ పుణ్యమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై అసత్యపు ప్రచారాలు చేస్తూ బురద చల్లాలని చూస్తే ప్రజలు భాజపా నాయకులను క్షమించరని అన్నారు. వినయ్ భాస్కర్‌తో పాటు ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్ ఉన్నారు.
ఇదీ చదవండి: 'ఏవీ సుబ్బారెడ్డి ఏ1, అఖిలప్రియ ఏ2, ఆమె భర్త ఏ3'