వరంగల్‌కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేటాయించిన కేంద్రం.. 125 ఎకరాలు అడిగితే రాష్ట్ర సర్కార్ ఇప్పటివరకు ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వాటా నిధులను కూడా ఇవ్వలేదని చెప్పారు. వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో పాల్గొన్న ఆయన.. భాజపా ద్వారానే వరంగల్ అన్ని విధాల అభివృద్ధి చెందిందని తెలిపారు.
తెలంగాణలో ఎన్నడూ లేనివిధంగా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామని కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్‌కు రింగ్‌రోడ్‌ను భాజపా ప్రభుత్వమే కేటాయించిందని వెల్లడించారు. అమృత్ సిటీ, హెరిటేజ్ సిటీ, స్మార్ట్ సిటీ కింద వరంగల్‌కు ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. కొందరు రాష్ట్రమంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.