వరంగల్ మహా నగరపాలక సంస్థ 19వ డివిజన్‌కు ఎన్నికల నగారా మోగింది. నేటి నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 14న నామపత్రాల పరిశీలన జరుగుతుంది. ఈనెల 15 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. మార్చి 25న పోలింగ్ జరుగనుంది. 27న ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లను బల్దియా అధికారులు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వరంగల్ మహా నగరపాలక సంస్థ కమిషనర్ రవికిరణ్ అధికారులను ఆదేశించారు.
ఉపఎన్నిక ఎందుకంటే...
వరంగల్ మహానగర పాలక సంస్థ 19వ డివిజన్లో కార్పొరేటర్‌గా గెలుపొందిన నన్నపనేని రాజేందర్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజేందర్ రాజీనామా చేయటంతో ఉపఎన్నిక అనివార్యమైంది. నామాపత్రాల ప్రక్రియ ప్రారంభం కావడంతో పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంలో నిమగ్నమయ్యాయి.
ఇవీ చూడండి:'లోక్‌సభ'కు కమలం కసరత్తు