వరంగల్ అర్బన్ జిల్లా హంటర్ రోడ్డు న్యూ శాయంపేటలో ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి చెందాడు. గోపాలపురం గ్రామానికి చెందిన ఈశ్వర్ భవన నిర్మాణ కార్మికునిగా పని చేస్తున్నాడు. పనుల్లో భాగంగా సెంట్రింగ్ కర్రలు విప్పుతుండగా కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి :ఇంటి పైకప్పు కూలి ఆరుగురు మృతి