తిండి కలిగితే కండ కలదోయ్.. కండ కలవాడేను మనిషోయ్.. గురజాడ పద్యానికి సరైన నిర్వచనం ఇచ్చారు వరంగల్ యువకులు. శరీర సౌష్ఠవ పోటీల్లో పాల్గొని సత్తాచాటారు.
కండల వీరులు
By
Published : Feb 17, 2019, 6:50 AM IST
|
Updated : Feb 17, 2019, 9:41 AM IST
కండల వీరులు
వరంగల్ పట్టణంలోని హన్మకొండలో శరీర సౌష్ఠవ పోటీలు అట్టహాసంగా జరిగాయి. 'మిస్టర్ వరంగల్' పేరుతో శ్యామల గార్డెన్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. 50, 90 కిలోల విభాగాల్లో వివిధ జిల్లాల నుంచి 150 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. రాష్ట్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.విజయ్, నగర సీపీ రవీందర్ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతిగా టీవీఎస్ స్పోర్ట్స్ వాహనాన్ని అందించారు. నగరంలో ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని సీపీ కొనియాడారు.