రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ భాజపా, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట, డీజిల్ కాలనీ, మడికొండ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. హిందువులు అధికంగా ఉన్న రాష్ట్రంలో వారి పండుగలపైనే ఆంక్షలు విధించడం నిజాం పాలనను గుర్తు చేస్తోందని భజరంగ్‌దళ్ వరంగల్ విభాగం సంయోజక్ ఆళ్లకట్ల సాయి కుమార్ ఎద్దేవా చేశారు.
హిందువుల పండుగలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేయాలని, కొన్నిచోట్ల వినాయక మండపాల నిర్వాహకులపై కేసులు పెట్టారని, వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. హిందువుల పండుగలపై ఆంక్షలు విధిస్తే అది రాష్ట్రానికే అరిష్టమని ప్రభుత్వానికి హితవు పలికారు.
ఇదీ చూడండి : విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ