ETV Bharat / state

సెప్టెంబర్ 12నుంచి నాలుగో ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభిస్తామన్న బండి సంజయ్

Bandi Sanjay fire ON CM KCR కేసీఆర్‌ గడీలు బద్దలు కొట్టే రోజు దగ్గర్లోనే ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భాజపా మత విద్వేషాలు రెచ్చగొడుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండలో మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Bandi Sanjay fire ON CM KCR
Bandi Sanjay fire ON CM KCR
author img

By

Published : Aug 27, 2022, 7:54 PM IST

Updated : Aug 27, 2022, 9:19 PM IST

Bandi Sanjay fire ON CM KCR కేసీఆర్‌కు ధైర్యముంటే రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రావాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేవలం ఆయన కుటుంబం కోసమే పనిచేస్తారని మండిపడ్డారు. భాజపా మత విద్వేషాలు రెచ్చగొడుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ గడీలు బద్దలు కొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. సెప్టెంబర్ 12నుంచి నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.

భాజపా కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారుని బండి సంజయ్‌ మండిపడ్డారు. భాజపా మాత్రం దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ కోసం 1400 మంది ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాము చేరినట్లు కేసీఆర్‌ వచ్చి చేరారని ధ్వజమెత్తారు. భాజపా మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. డిండి ప్రాజెక్టును తెరాస సర్కారు నిర్లక్ష్యం చేసిందన్న బండి సంజయ్‌.. ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కళాశాల హామీ ఏమైందని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

కేసీఆర్‌కు ధైర్యముంటే రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రావాలి. ప్రతి చేతికి పని..ప్రతి చేనుకు నీరు భాజపా సిద్ధాంతం. కేసీఆర్‌ గడీలు బద్దలు కొట్టే రోజు దగ్గర్లోనే ఉంది. నాలుగో ప్రజాసంగ్రామ యాత్ర ఈ వేదికగానే ప్రకటిస్తున్నాం. సెప్టెంబర్ 12నుంచి నాలుగో ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నాం.చిన్న వర్షానికే హైదరాబాద్‌, వరంగల్‌ మునిగిపోతోంది.కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగులకు జీతాలు లేవు.కేసీఆర్‌ కుటుంబంపై దిల్లీ లిక్కర్‌ కుంభకోణం ఆరోపణలు వస్తున్నాయి. కుంభకోణం ఏదైనా కేసీఆర్‌ కుటుంబానికి లింకులు. - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

హైదరాబాద్‌, వరంగల్‌ మునిగిపోతోంది: భాజపా కార్యకర్తలు ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేస్తారని బండి సంజయ్ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో ఎంతో క్రమశిక్షణతో కార్యకర్తలు పనిచేశారని ప్రశంసించారు. పోలీసులకు భాజపా ఎప్పడూ వ్యతిరేకంగా కాదన్నారు. ప్రతి చేతికి పని.. ప్రతి చేనుకు నీరు భాజపా సిద్ధాంతమని బండి సంజయ్ స్పష్టం చేశారు. చిన్న వర్షానికే హైదరాబాద్‌, వరంగల్‌ మునిగిపోతోందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగులకు జీతాలు లేవని మండిపడ్డారు.

సెప్టెంబర్ 12నుంచి నాలుగో ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభిస్తామన్న బండి సంజయ్

లిక్కర్‌ కుంభకోణం ఆరోపణలు: కేసీఆర్‌ కుటుంబంపై దిల్లీ లిక్కర్‌ కుంభకోణం ఆరోపణలు వస్తున్నాయని బండి సంజయ్ తెలిపారు. కుంభకోణం ఏదైనా కేసీఆర్‌ కుటుంబానికి లింకులు ఉంటాయని ఎద్దేవా చేశారు. లిక్కర్ కుంభకోణం నుంచి కుటుంబాన్ని కాపాడుకోవడానికి కేసీఆర్‌ యత్నిస్తున్నారని ఆరోపించారు. హిందు దేవతలను అవమానించే మునావర్ కామెడీ షోకు ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారని మండిపడ్డారు.

అందుకే పాతబస్తీలో అల్లర్లు: లిక్కర్‌ స్కామ్‌ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మునావర్‌ షో పెట్టించారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్‌ స్కామ్‌ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పాతబస్తీలో అల్లర్లు సృష్టించారని పేర్కొన్నారు. భాజపాను బదనాం చేయడానికే మత ఘర్షణలు చెలరేగేలా చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వాలు కూడా అధికారం కోసం మత ఘర్షణలు సృష్టించాయని గుర్తు చేశారు. భాజపా ఎప్పుడూ ఏ మతాన్ని కించపరచలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇతర పార్టీలు పాదయాత్రలు చేయకూడదా? అని కేసీఆర్‌ను బండి సంజయ్‌ ప్రశ్నించారు.

ఇవీ చదవండి: JP Nadda Fire on CM KCR కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే లక్ష్యమన్న జేపీ

భాజపాను గెలిపిస్తే రాష్ట్రంలో మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొంటుందన్న కిషన్​రెడ్డి

ఆశీర్వాదం పేరుతో స్వామీజీ లైంగిక వేధింపులు, బాలికలను గదిలోకి పిలిచి

Last Updated : Aug 27, 2022, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.