ETV Bharat / state

న్యాయం చేయాలంటూ టవర్​ ఎక్కిన భాజపా అభ్యర్థి - టవర్​ ఎక్కిన భాజపా అభ్యర్థి శ్యాం

వరంగల్ పుర ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు రెండోసారి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారని భాజపా అభ్యర్థి బైరి శ్యామ్ ఆరోపించారు. సెల్​ఫోన్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

BJP candidate Bairi Shyam, municipal election news, warangal

author img

By

Published : May 6, 2021, 5:45 PM IST

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ భాజపాకు చెందిన అభ్యర్థి సెల్​ఫోన్ టవర్ ఎక్కి ఆందోళన చేయడం స్థానికంగా కలకలం రేపింది. 34వ డివిజన్ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచిన బైరి శ్యామ్ తెరాస అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు అనంతరం స్వల్ప మెజార్టీతో శ్యామ్ గెలిచాడని ప్రకటించగా.. తెరాస అభ్యర్థి రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు.

అదే రోజు తిరిగి ఓట్లను లెక్కించగా.. 11 ఓట్ల తేడాతో తెరాస అభ్యర్థి కుమారస్వామి గెలుపొందారని అధికారులు సర్టిఫికేట్ అందజేశారు. సద్దుమణిగింది అనుకున్న వివాదం.. శ్యామ్ టవర్ ఎక్కి ఆందోళన చేయడం వల్ల వివాదాస్పదంగా మారింది. అధికార పార్టీ నాయకులు అధికారులతో చరవాణిలో సంభాషించి.. తన ఓటమికి కారకులయ్యారని ఆరోపించారు.

పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తన గెలుపును జీర్ణించుకోలేక వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కావాలని తన గెలుపును అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: 'కొవిడ్​ బారిన పడిన చిన్నారుల కోసం ప్రత్యేక వసతి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.