ETV Bharat / state

'రూ. పదివేల వరద సాయం ఇక్కడ కూడా ఇవ్వాలి' - వరద సాయం అందించాలని వరంగల్​లో భాజపా ధర్నా

వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ వరంగల్​ నగరంలో భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. జీహెచ్​ఎంసీ పరిధి​లో ఏ విధంగా అయితే వరద సాయం అందించారో అదే రీతిలో ఇక్కడ కూడా సాయం అందించాలని నేతలు నిరసన చేపట్టారు.

bjp activists protests in warangal for flood relief fund
'వరంగల్​లో వరద బాధితులకు రూ. పదివేల సాయం అందించాలి'
author img

By

Published : Dec 12, 2020, 2:59 PM IST

వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భాజపా శ్రేణులు వరంగల్​లో ఆందోళనకు దిగాయి. జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ నేతృత్వంలో​​ వరంగల్ ఎంజీఎం కూడలి వద్ద ఆ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

అక్టోబర్​లో కురిసిన భారీ వర్షాల వల్ల వరంగల్​లోనూ చాలా మంది వరదల్లో చిక్కుకుపోయారని కార్యకర్తలు అన్నారు. హైదరాబాద్​లో వరద బాధితులకు ఏ విధంగా అయితే ప్రభుత్వం రూ. 10వేల ఆర్థిక సాయం అందించిందో అదే తీరుగా ఇక్కడ కూడా సాయం అందించాలని డిమాండ్ చేశారు. ధర్నాతో కూడలి వద్ద వాహనాలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి: కొవిడ్ వ్యాక్సిన్ భారత్​లో తయారవడం గర్వకారణం: దత్తాత్రేయ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.