వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో భద్రకాళీ భద్రేశ్వర కల్యాణ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ భద్రేశ్వరుడు భద్రకాళీ అమ్మవారికి మాంగల్యధారణ చేయగా మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు స్వామివారికి తలంబ్రాలు సమర్పించారు. కరోనా నేపథ్యంలో కల్యాణ మహోత్సవాన్ని సాదాసీదాగా జరిపారు.
ఇదీ చూడండి: కరోనా చికిత్సకు సరికొత్త పద్ధతి