తమలపాకు, గులాబీల సోయగం ఓ ఇంటికి ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చింది. తీగ జాతికి చెందిన తమలపాకు రెండంతస్తుల మేర పెరిగి అందరినీ ఆకట్టుకుంటోంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ టీచర్స్ కాలనీ ఫేజ్ 2లోని ఓ ఇంట్లో తమలపాకు తీగ ఏపుగా పెరిగింది. ఇంటిపైకి ఎగబాకి పచ్చదనంతో కనువిందు చేస్తోంది.
ఎర్ర గులాబీ మొక్క దీనికి అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. ఎర్రటి గులాబీ, పచ్చని తమలపాకు అలుముకొన్న సోయగం అందరినీ అబ్బురపరుస్తోంది. రోజూ నీళ్లు పోస్తూ... సేంద్రీయ ఎరువులు వాడడం వల్ల ఏపుగా పెరిగిందని యజమాని తెలిపారు.
ఇదీ చదవండి: వినోదం సంపూర్ణం: సినిమాహాళ్లలో వందశాతం సీటింగ్కు అనుమతి