తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా అమోదించవద్దంటూ వరంగల్ జిల్లాకు చెందిన బానోత్ ప్రేమ్ నాయక్ ఈసీకి లేఖ రాశారు. భారతీయ రాష్ట్ర సమితి పేరుతో సెప్టెంబర్ 5న ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నానని.... ఆ తర్వాత ఆక్టోబర్ 5న ముఖ్యమంత్రి కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి పేరును అధికారికంగా ప్రకటించారని అన్నారు. మొదటగా తాను దరఖాస్తు చేసుకున్నందు వల్ల బీఆర్‌ఎస్ పార్టీ పేరును తనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌పై అభ్యంతరాలు తెలిపేందుకు ఈసీ ఇచ్చిన గడువు నేటితో ముగియనున్న తరుణంలో...ప్రేమ్ నాయక్ ఈసీకి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
''బీఆర్ఎస్ కోసం కేసీఆర్ కంటే ముందుగా ఈసీకి దరఖాస్తు చేశాను. సెప్టెంబర్ 5న బీఆర్ఎస్ కోసం ఈసీకి దరఖాస్తు చేశాను. బీఆర్‌ఎస్ పార్టీ పేరును నాకే కేటాయించాలి.'' - బానోత్ ప్రేమ్ నాయక్
ఇవీ చూడండి: