ETV Bharat / state

మహిళా దినోత్సవం సందర్భంగా చట్టాలపై అవగాహన

author img

By

Published : Mar 8, 2020, 6:25 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలను నిర్వహించారు. అందులో భాగంగానే మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించారు.

womens day celebrations in warangal urban
మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు చట్టాలపై అవగాహన

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాజీపేట డివిజన్ పరిధిలోని సుమారు 5 వేల మందికిపైగా మహిళలు, కళాశాలల విద్యార్థినిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై మహిళా సాధికారత, రక్షణ వంటి అంశాలపై ప్రసంగించారు.

రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఈ సంవత్సరాన్ని రోడ్డు భద్రత, మహిళ భద్రత సంవత్సరంగా పాటిస్తున్నట్లు తెలిపారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, 100 డయల్ వంటివాటిపై సీపీ వారికి అవగాహన కల్పించారు. అనంతరం పోలీసులు, అధ్యాపకులు వంటి వివిధ వృత్తులలో రాణిస్తున్న మహిళామణులను శాలువాలతో సీపీ సత్కరించారు.

ఇవీ చూడండి: ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.