రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రజలందరూ శుభ్రత పాటించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సూచించారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేసుకోవాలన్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తిలో విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్యే రమేశ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ వేళ ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆరూరి గట్టమల్లు ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
![arururi ramesh distributed groceries to carpenters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-01-18-mla-sarakula-pampini-av-ts10077_18052020110523_1805f_00553_483.jpg)