రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాల్టీలకు మేయర్, ఛైర్మన్‌ల ఎంపిక ప్రక్రియ సజావుగా పూర్తి చేయడంపై తెరాస దృష్టి సారించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలకులను నియమించారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా నకిరేకల్, సిద్దిపేట, కొత్తూరు, అచ్చంపేట, జడ్చర్లకు శుక్రవారం మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియ జరగనుంది.
బాధ్యతలు వారికే..
వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల పరిశీలకులుగా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్‌ను సీఎం నియమించారు. ఖమ్మం కార్పొరేషన్‌కు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ నరేశ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిశీలకులుగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, నకిరేకల్‌కు తెరాస ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్‌రావు, సిద్దిపేటకు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్, ఒంటేరు ప్రతాప్‌రెడ్డిని పరిశీలకులిగా నియమించారు. అచ్చంపేటకు మంత్రి నిరంజన్‌రెడ్డి , జడ్చర్లకు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పరిశీలకులు గురువారం ఆయా ప్రాంతాలకు చేరుకొని.. సీల్డు కవర్లలోని పేర్లకు అనుగుణంగా ఎన్నిక జరిగేలా బాధ్యతలు నిర్వర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇదీ చూడండి: కోరితే నేనే రాజీనామా చేసేవాణ్ని: ఈటల