ETV Bharat / state

లంచం తిరిగి ఇస్తుండగా పట్టుకున్న అనిశా

తీసుకున్న లంచాన్ని తిరిగి ఇస్తున్న అధికారిని అనిశా పట్టుకుంది. అన్ని అనుమతులు ఉన్న ఓ ఇంటి యజమాని నుంచి 9 వేలు లంచం డిమాండ్​ చేసిన బిల్డింగ్​ ఇన్స్పెక్టర్​, చైన్​మెన్​ను వరంగల్​ మహానగర సంస్థ కమిషనర్​ రవి కిరణ్​ తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

లంచం తిరిగి ఇస్తుండగా పట్టుకున్న అనిశా
author img

By

Published : Jun 27, 2019, 10:51 AM IST

లంచం తీసుకుని తిరిగి ఇంటి యజమానికి అప్పగిస్తూ అవినీతి నిరోధక శాఖకు దొరికిన ఘటన వరంగల్​లో చోటుచేసుకుంది. హన్మకొండలోని నయీమ్ నగర్​లో ఓ భవన యజమాని నుంచి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ బాబు, చైన్​మెన్ రమేశ్​ 9 వేల లంచం డిమాండ్​ చేశారు. ఇంటి యజమానికి అన్ని అనుమతులు ఉన్నా.. పని సాగనీయకుండా ఇబ్బందులకు గురి చేశారు. దీనితో ఏం చేయాలో తెలియని ఆ యజమాని అధికారులు అడిగినంత ముట్ట చెప్పారు. అనంతరం బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ బాబు తీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. ఇరువురిపై ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన అధికారులు ప్రవీణ్​ను మందలించారు. లంచంగా తీసుకున్న 9 వేలను ఇంటి యజమానికి ప్రవీణ్​ అప్పగిస్తుండగా.. అనిశా అధికారులు చాకచక్యంగా వీడియోలను రహస్యంగా చిత్రీకరించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడం వల్ల వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ రవి కిరణ్ ఇరువురిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

లంచం తిరిగి ఇస్తుండగా పట్టుకున్న అనిశా

ఇవీ చూడండి: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.