ETV Bharat / state

Animal Beauty Contests: మీకే కాదు మాక్కూడా జరిగాయి అందాల పోటీలు! - Warangal news

Animal Beauty Contests: అందమైన ఆవులు... సుందరమైన శునకాలు... మెరిసే కళ్ల పిల్లులు.. ఎటుచూసినా ఆకట్టుకునే ఆలంకరణలో పెంపుడు జంతువులు... చూపరులకు కనువిందు చేశాయి. వరంగల్‌ నర్సంపేటలో జరిగిన పశువుల అందాల పోటీలు... పండుగ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Animal
Animal
author img

By

Published : Jan 15, 2022, 5:57 AM IST

మీకే కాదు మాక్కూడా జరిగాయి అందాల పోటీలు!

Animal Beauty Contests: నల్లని రూపం రాజకిరీటంలాంటి జుట్టుతో చూడగానే కట్టిపడేసే కడక్‌నాథ్‌ కోడి! బంగారు వర్ణంలో మెరిసే గుండ్రటి కళ్లతో... కళ్లు తిప్పుకోనివ్వని అందమైన పిల్లి! ముచ్చటైన బొచ్చుతో చూడగానే... ఎత్తుకుని హత్తుకోవాలనిపించే బుజ్జి కుక్కలు! పహిల్వాన్‌లా బొట్టుపెట్టుకుని కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు! వరంగల్‌ జిల్లా నర్సంపేటలో... ఎటుచూసినా ఆకట్టుకునే పశువులతో జంతుప్రేమికులు పండగ చేసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా జరిగిన పశువుల అందాల పోటీలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

పాడి గొప్పదనాన్ని తెలియజేస్తూ...

జంతువలను ప్రేమించడం, పాడి పశువుల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో.....నర్సంపేట రైతు శాంతి సేవా సంఘం ఈ పోటీలను ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శనరెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి గేదెలు, పొట్టేళ్లు, శునకాలు, పిల్లులు, కుందేల్లతో...జంతుప్రేమికులు పోటీలకు తరలివచ్చారు. పాడి గొప్పదనాన్ని తెలియజేస్తూ....పల్లె జీవనాన్ని ప్రతిబింబించే ఈ తరహా కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని ఎమ్మెల్యే సుదర్శనరెడ్డి ఆకాంక్షించారు. అందాల పోటీల్లో వివిధ విభాగాల్లో గెలుపొందిన జంతువుల యజమానులకు.... ఎమ్మెల్యే చేతులమీదుగా బహుమతులు అందించారు.

ఇదీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.