ETV Bharat / state

బెల్టుషాపు తొలగించాలని ఓ కుటుంబం వినూత్న నిరసన

author img

By

Published : Jan 24, 2021, 11:21 AM IST

ఓ వ్యక్తి తన భార్యా బిడ్డలతో కలిసి నిరసన ప్రదర్శనకు దిగాడు. తన ఇంటి ముందే బైఠాయించి ఆందోళన చేపట్టాడు. ఈ నిరసన.. తమకు ప్రభుత్వ పథకం అందడం లేదని కాదు... నష్టపోయిన వాటికి పరిహారం ఇప్పిచమని కాదు.. అన్యాయం జరిగిన తమకు న్యాయం చేయమని కాదు. మరి దేనికోసమంటే.. వారి ఇంటికి సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం గొలుసు దుకాణాన్ని తొలగించమని..

మద్యం గొలుసు దుకాణం తొలగించాలని  ఓ కుటుంబం వినూత్న నిరసన

జనావాసాల మధ్యనున్న మద్యం బెల్ట్‌ షాప్‌ను తొలగించాలని ఓ కుటుంబం వినూత్న రీతిలో నిరసనకు దిగింది. గొలుసు దుకాణాన్ని తొలగించాలంటూ కమలాపూర్‌ మండలం పంగిడిపల్లికి చెందిన గ్రామీణ వైద్యుడు తిప్పారపు యుగేందర్‌ తన కుటుంబంతో కలిసి తన ఇంటి ఎదుట బైఠాయించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం పంగిడిపల్లికి చెందిన గ్రామీణ వైద్యుడు తిప్పారపు యుగేందర్‌... తన భార్య చామంతి, పిల్లలతో కలిసి వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. తన ఇంటి సమీపంలో ఉన్న మద్యం గొలుసు దుకాణాన్ని తొలగించాలంటూ ఆందోళనకు దిగాడు. అర్ధరాత్రి వరకు మద్యం గొలుసు దుకాణం నిర్వహిస్తున్నారని... జనావాసాల్లో మద్యం దుకాణం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నామని... ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దుకాణం తొలగించాలని కోరుతున్నారు. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని పలు వివరాలు సేకరించారు.

రెండేళ్ల క్రితం మా ఇంటి పక్కన ఓ బెల్ట్​ షాపును ప్రారంభించారు. అప్పుడే చెప్పాం ఇంటి దగ్గర మద్యం అమ్మడం ఏంటని... కానీ ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకుండా నడిపించుకుంటామంటే.. బతుకుదెరువుకు ఎందుకు అడ్డురావడం అని భావించాం.. కానీ ఇప్పుడు అర్ధరాత్రి దాటే వరకు అమ్ముతున్నారు. ఇది ఏంటని అడిగితే మేము ఇలాగే చేస్తాం.. మీరేమి చేసుకుంటారో చేసుకోండని చెబుతున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాం. అయినా పరిష్కారం కాలేదు. అధికారులు స్పందించి తక్షణమే బెల్ట్​ షాపును తొలగించాలి. -చామంతి, యుగేందర్​ భార్య

ఇదీ చూడండి: తపాలా శాఖతో 'హస్తకళ'కు ప్రత్యేక గుర్తింపు: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.