ETV Bharat / state

అమెరికాలో అతిపెద్ద అంజన్న విగ్రహం... చెక్కింది వరంగల్‌లోనే - warangal hanuman idol in us

అమెరికా హాకెసిన్ నగరంలో 25 అడుగుల అంజన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని అతి పెద్ద ఏకశిలతో వరంగల్‌లోనే రూపొందించారు. పలువురు శిల్పులు నెలల తరబడి శ్రమించి సుమారు 30 వేల కిలోల బరువున్న ఈ భారీ విగ్రహాన్ని చెక్కారు.

lord hanuman
lord hanuman
author img

By

Published : Jun 18, 2020, 7:51 AM IST

అమెరికాలో అతిపెద్ద ఏకశిలతో మలిచిన హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 25 అడుగుల విగ్రహాన్ని ఈ మధ్యే హాకెసిన్‌ నగరంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని రూపొందించింది వరంగల్‌ నగరంలోనే కావడం విశేషం. కాకతీయుల శిల్పాలను మలచడానికి వినియోగించిన నల్లరాతి శిలనే ఈ ఆంజనేయుడి విగ్రహానికి వినియోగించారు.

వరంగల్‌ నగర శివారులోని ఓ క్వారీ నుంచి బ్లాక్‌ గ్రానైట్‌ శిలను తీసి, పలువురు శిల్పులు నెలల తరబడి శ్రమించి సుమారు 30 వేల కిలోల బరువున్న ఈ భారీ విగ్రహాన్ని చెక్కారు. లాక్‌డౌన్‌ కన్నా ముందే ఈ విగ్రహాన్ని అమెరికాకు పంపారు. తాజాగా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం జరిగింది.

ఇదీ చదవండి: లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ సందేహానికి ప్రధాని స్పష్టత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.