ETV Bharat / state

వరంగల్​ ఎంజీఎంలో 210 మందికి క్వారంటైన్​ పూర్తి

వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలో కోరనా లక్షణాలతో ఇప్పటివరకు 562 మంది చేరగా.. 210 మంది 14 రోజుల క్వారంటైన్​ను పూర్తి చేసుకున్నట్లు జిల్లా వైద్యాధికారి లీలాదేవి తెలిపారు. గత నాలుగు రోజుల్లో 12 మంది వైరస్​ లక్షణాలతో చేరగా.. వారి ఫలితాలు రావాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు.

వరంగల్​ ఎంజీఎంలో 210 మందికి క్వారంటైన్​ పూర్తి
వరంగల్​ ఎంజీఎంలో 210 మందికి క్వారంటైన్​ పూర్తి
author img

By

Published : Mar 27, 2020, 12:35 PM IST

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో ఇప్పటివరకు మొత్తం 562 మంది చేరారు. వారిలో 210 మంది 14 రోజుల క్వారంటైన్​ను ​ పూర్తి చేసుకున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లీలాదేవి తెలిపారు. మరో 352 మంది ఇంటిలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు పేర్కొన్నారు.

గత నాలుగు రోజుల వ్యవధిలో 12 మంది వైరస్ లక్షణాలతో ఎంజీఎం ఆస్పత్రిలో చేరినట్లు లీలాదేవి స్పష్టం చేశారు. అయితే వారి రిపోర్టులు ఇంకా రాలేదన్నారు. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ఇద్దరిని ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు లీలాదేవి పేర్కొన్నారు. 14 రోజుల అనంతరం మరోసారి పరీక్షలు నిర్వహించి డిశ్చార్జీ చేస్తామని ఆమె తెలిపారు.

ఇదీ చూడండి: నిబంధన అతిక్రమిస్తే చలానా ఇంటికొస్తుంది: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.