ETV Bharat / state

విద్యుదాఘాతంతో పదో తరగతి విద్యార్థి మృతి - 10TH CLASS STUDENT DIED WITH CURRENT SHOCK IN GOLLAPALLY

పెద్ద నాన్నతో సరదాగా పొలానికి వెళ్లాడు ఆ పదో తరగతి విద్యార్థి. మోటర్​ వేయమనగానే చకచకా వెళ్లాడు. మోటర్​ వెయ్యాలనే ఆతృతతో స్టాటర్​ బాక్స్​ తలుపు తీశాడు. కరెంట్​షాక్​ వచ్చి అక్కడికక్కడే విగతజీవిగా మారాడు. దీనికంతటికీ కారణం... ఆ కనెక్షన్​ వైరును ఎలుకలు కొట్టటమే...!

10TH CLASS STUDENT DIED WITH CURRENT SHOCK IN GOLLAPALLY
10TH CLASS STUDENT DIED WITH CURRENT SHOCK IN GOLLAPALLY
author img

By

Published : Dec 16, 2019, 7:52 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గొల్లపల్లిలో విషాదం జరిగింది. చొప్పురి కార్తీక్ (16) అనే పదో తరగతి విద్యార్థి... తన పెద్ద నాన్నతో కలిసి పొలం దగ్గరికి వెళ్లాడు. మోటార్ వేసేందుకు వెళ్లగా... విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్టార్టర్ బోర్డుకున్న కనెక్షన్ వైర్​ను ఎలుకలు కొట్టటం వల్ల బోర్డు బాక్స్​కు కరెంట్​షాక్​ వచ్చి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధరించారు. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావటం వల్ల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

విద్యుదాఘాతంతో పదో తరగతి విద్యార్థి మృతి

ఇదీ చూడండి : పాత్రికేయులు, రాజకీయ నాయకుల బంధం విచిత్రమైనది: కవిత

Intro:TG_KRN_102_16_VIDYUTH SHOCK_VIDYARTHI MRUTHI_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-----------------------------------------------------------వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చొప్పురి కార్తీక్ (16) అనే పదవ తరగతి చదువుతున్న విద్యార్థి పెద్ద నాన్నతో కలిసి పొలం దగ్గరికి వెళ్లగా వరినాట్లు వేస్తుండడంతో కార్తీక్ మోటార్ ఆన్ చేసే క్రమంలో స్టార్టర్ బోర్డు కున్న కనెక్షన్ వైర్ ను ఎలుకలు కొట్టడాన్ని గమనించలేదు. స్టార్టర్ బోర్డు ఇనుపది కావడంతో స్టార్టర్ బోర్డు డోర్ ను కార్తీక్ తన చేతితో తెరిచి పట్టుకొని మోటార్ బటన్ ను ఆన్ చేయగానే విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తల్లిదండ్రుల బంధువుల గ్రామస్తుల రోదనలతో గ్రామంలో విషాదం అలుముకుంది. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి మృతుని తండ్రి చొప్పురి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.Body:బైట్

1) ముల్కనూర్ ఎస్సై సూరిConclusion:విద్యుత్ షాక్ కు గురై విద్యార్థి మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.