ETV Bharat / state

ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలి: యూత్‌ కాంగ్రెస్‌ - వరంగల్‌ గ్రామీణ జిల్లా తాజా వార్తలు

రాష్ట్రంలో ఉద్యోగ నియామకానికి వెంటనే ప్రకటన విడుదల చేయాలని... యూత్ కాంగ్రెస్ వరంగల్ గ్రామీణ జిల్లా అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం అసెంబ్లీ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా యూత్‌ కాంగ్రెస్‌ పిలుపునివ్వడంతో... జిల్లా నాయకులను పరకాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Youth Congress leaders demand release of notification for jobs in Warangal rural district
ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలి: యూత్‌ కాంగ్రెస్‌
author img

By

Published : Mar 20, 2021, 3:42 PM IST

ఉద్యోగ నియామకాలను త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని నిరుద్యోగులను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని... యూత్‌ కాంగ్రెస్‌ వరంగల్‌ గ్రామీణ జిల్లా అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్‌ అన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని మార్చిపోయారని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం అసెంబ్లీ ముట్టడికి యూత్‌ కాంగ్రెస్‌ పిలుపునివ్వడంతో... జిల్లా నాయకులను పరకాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రికి త్వరలోనే రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అక్రమ అరెస్టులతో ప్రజల కోసం చేస్తున్న పోరాటాన్ని ఆపలేరని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలిపారు.

ఇదీ చదవండి:జొమాటో ఐపీఓ.. వచ్చే నెల సెబీకి దరఖాస్తు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.