ETV Bharat / state

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు .. ఇప్పుడు వద్దంటున్నాడు..

WIFE PROTEST BEFORE HUSBAND HOUSE: ప్రేమించుకున్నారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. నెల రోజులపాటు అంతా బాగానే నడిచింది. కానీ యువకుడు తల్లిదండ్రులు మొదట బాగానే ఉన్న తర్వాత ప్లేటు ఫిరాయించారు. అదనపు కట్నం కోసం ఆ యువతిని వేధించడం మొదలుపెట్టారు. దిక్కు తోచని స్థితిలో ఆ యువతి.. భర్త ఇంటి ముందు న్యాయపోరాటానికి దిగింది. చావైనా బ్రతుకైనా భర్తతోనే అంటూ ఆమె కన్నీటి పర్యంతమవుతోంది.

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు .. ఇప్పుడు వద్దంటున్నాడు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు .. ఇప్పుడు వద్దంటున్నాడు..
author img

By

Published : Mar 11, 2022, 4:40 AM IST

WIFE PROTEST BEFORE HUSBAND HOUSE: వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం బట్టుతండకు చెందిన బాధవత్ అనిల్, లచ్చ తండాకు చెందిన స్రవంతి ప్రేమించుకున్నారు. జనవరిలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు బాగానే గడిచాయి. కానీ గత కొన్ని రోజులుగా భర్త, అత్తమామలు స్రవంతిని అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశారు.

దీంతో వారి వేధింపులు తాళలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అనిల్ కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. ఆమె తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించింది. చావైనా బ్రతుకైనా భర్తతోనే అంటూ కన్నీటి పర్యంతమవుతోంది.

ఇదీ చదవండి: women's empowerment: మహిళల ఆర్థిక స్వావలంబన.. వాటితో నెలకు రూ.80 వేల ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.