రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కూమార్ విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను వరంగల్ గ్రామీణ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి స్వీకరించారు. హన్మకొండలోని జడ్పీ కార్యాలయంలో మూడు మొక్కలను నాటారు. అనంతరం మరో ముగ్గురికి మొక్కలు నాటాలని గ్రీన్ చాలెంజ్ వసిరారు. ఇది మంచి కార్యక్రమం అని దీన్ని మరింత ముందుకు తీసుకుపోతానని చెప్పారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలంటే మొక్కలను నాటి, వాటిని సంరక్షించుకోవాలని తెలిపారు.
ఇవీ చూడండి: ఆర్టీసీపై న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత