ప్రస్తుత పరిస్థితుల్లో అందర్నీ భయాందోళనలకు గురి చేస్తోన్న కరోనా మహమ్మారి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ రూరల్ జిల్లా వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఏలాంటి సందేహాలున్నా హెల్ప్‌లైన్ నంబర్లు సహాయంతో నివృతి చేసుకోవాలన్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఆయన వెల్లడించారు.
రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. మహిళలపై జరుగుతోన్న దాడులను హేమమైనవిగా పేర్కొన్నారు. వాటిని అరికట్టడానికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.
ఇసుక డంప్‌లపై దాడులు చేసి సుమారు 68 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. వారి నుంచి ట్రాక్టర్‌లు, మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి వారిపై కాఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్ధన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ రమేష్, సీఐ విశ్వేశ్వర్, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.