ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్తే లారీల కొరతతో ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోంది. పంట విక్రయించేలోపే అకాల వర్షానికి నష్టపోతామేమోనని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోందని తెలుసుకున్న వరంగల్ గ్రామీణ జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి మందారిపేట్ క్రాస్రోడ్డుపై వెళ్తోన్న లారీలను ఆపి, శాయంపేట కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని తరలించేలా చర్యలు తీసుకున్నారు.
కేసీఆర్ సర్కార్ రైతుల వెన్నంటే ఉంటుందని గండ్ర జ్యోతి అన్నారు. కరోనా వ్యాప్తి వల్ల నిలిచిపోయిన వరి ధాన్యం, మక్కల కొనుగోళ్లను వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: తీరాన్ని తాకిన నిసర్గ తుపాను.. గాలుల బీభత్సం