వరంగల్ గ్రామీణ జిల్లాలో కొంతమంది పని కట్టుకుని సోషల్ మీడియా వేదికగా కరోనాపై అసత్య ప్రచారం చేస్తున్నారని వర్ధన్నపేట పోలీసులు ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన తప్పుడు సమాచారాన్ని అందరికీ షేర్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.
అలాంటి వారిని వదిలేది లేదని నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా చట్టరీత్యా శిక్షార్హులని పోలీసులు అన్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.