విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆదేశించారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని విలీన గ్రామాల కార్పొరేటర్లు, వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి హన్మకొండలోని కుడా కార్యాలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని డివిజన్లు పూర్తిగా విలీన గ్రామలతో నిండి ఉన్నాయని, వాటి అభివృద్ధి పనులను త్వరతగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. విలీన గ్రామాల్లో రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పెట్టుబడులకు పోటీ... హైదరాబాద్ నలువైపులా ఐటీ!