వరంగల్ రూరల్ జిల్లా హసన్ పర్తి మండలంలో లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది పేద ప్రజలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నిత్యావసర సరుకులు అందజేశారు. ఇంకెవరికైనా సమస్యలుంటే తనకు తెలపాలని... కచ్చితంగా వారికి సాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.
కరోనా వైరస్ పట్ల ఎవ్వరూ ఆందోళన చెందవద్దని.. అలాగని నిర్లక్ష్యం చేయవద్దని ఎమ్మెల్యే సూచించారు. కరోనా వైరస్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. కరోనా వ్యాధి నిర్మూలనకు లాక్డౌన్ పూర్తయ్యేవరకూ ఏ ఒక్కరూ ఇంట్లోంచి బయటకు రాకూడదని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సూచించారు.
ఇవీ చూడండి: కాలిబాటపై మృతదేహం... తండ్రి కోసం పిల్లల ఆరాటం