కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపటి భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కోరారు. వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేయాలని భాజపా చూస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీరు వల్లే రైతులు భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుందని అన్నారు.
రైతుల నిరసనకు ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. రేపటి బంద్‌లో పార్టీ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఇదీ చదవండి: కవాడిగూడ డివిజన్ పెద్దకూతురు.. కార్పొరేటర్ రచన