రాష్ట్రవ్యాప్తంగా 41వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో ఆందోళనలు, నిరసనలతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కార్మికులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పరకాల డిపో ముందు నాలుగు గంటలపాటు బైఠాయించారు. తాత్కాలిక సిబ్బందిని విధులు నిర్వహించకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.
ఇదీ చదవండిః తాగి రెచ్చిపోయిన గల్లీ లీడర్లు.. జై కొట్టిన పోలీసులు