ETV Bharat / state

పరీక్షలు పూర్తయ్యాయోచ్​: ఇంటర్మీడియట్​ విద్యార్థులు - వరంగల్ గ్రామీణ జిల్లా

ఇంటర్మీడియట్​ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని ఇంటర్మీడియట్​ విద్యార్థులు పరీక్షలు ముగియడం వల్ల తమతమ మిత్రులకు వీడ్కోలు పలుకుతూ.. వసతి గృహాల నుంచి ఇళ్లబాట పట్టారు.

successfully inter exams finished in warangal rural
పరీక్షలు పూర్తయ్యాయోచ్​: ఇంటర్మీడియట్​ విద్యార్థులు
author img

By

Published : Mar 18, 2020, 6:54 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభమైన పరీక్షలు 14 రోజులపాటు కొనసాగగా... ఈరోజు రాసిన పరీక్షతో ఇంటర్మీడియట్​ పరీక్షలు పూర్తయ్యాయి. చివరి పరీక్ష రాసి.. హమ్మయ్యా.. పరీక్షలు అయిపోయాయని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

పరీక్షాకేంద్రాలను వీడుతూ తమ తమ మిత్రులకు వీడ్కోలు పలికారు. వసతి గృహాలను వదిలి ఇళ్లకు పయనమయ్యారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లండని.. స్వీయ పరిశుభ్రత పాటించండంటూ ఉపాధ్యాయులు అధికారులు విద్యార్థులకు సూచనలిచ్చారు.

ఇవీ చూడండి: ఎంపీ రేవంత్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.