ETV Bharat / state

ముంబైలో అంబేడ్కర్ గృహంపై దాడికి పరకాలలో నిరసన - sc st protest at parakala

మహారాష్ట్ర ముంబైలో అంబేడ్కర్​ నివాసంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ సంఘాల యువకులు వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాల బస్టాండ్​ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. దాడికి పాల్పడిన వారందరినీ కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు.

sc st samithi protest against attack on ambedkar house in mumbai at parakala
ముంబైలో అంబేడ్కర్ గృహంపై దాడికి పరకాలలో నిరసన
author img

By

Published : Jul 11, 2020, 1:59 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాల పట్టణంలో ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహారాష్ట్ర ముంబైలో అంబేడ్కర్​ నివాసంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ సంఘాల యువకులు పరకాల బస్టాండ్​ నుంచి స్థానిక అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు.

అంబేడ్కర్​ ఇంటిపై జరిగిన దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని వెంటనే శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేడ్కర్​ ఇంటిపైన దాడి జరిగితే అది దేశంపై జరిగినట్లుగా పరిగణించాలని.. బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వారు సర్కారును కోరారు.

ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.