వరంగల్ గ్రామీణ జిల్లాలో కొవిడ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పలు గ్రామాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సర్పంచ్లు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో వైరస్ కట్టడికి సర్పంచ్ గొడిశాల మమత సదానందం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.
గ్రామాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని... ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప లాక్డౌన్ సమయంలో ఎవ్వరూ బయటకు రావొద్దని సూచించారు.
ఇదీ చూడండి: బ్లాక్ ఫంగస్ ఔషధాలు కావాలంటే మెయిల్ చేయండి: కేటీఆర్