ETV Bharat / state

మళ్లీ జనజీవనంలోకి నాటుసారా - మళ్లీ జడలు విచ్చుకుంటోన్న గుడుంబా

పల్లెల్లో ఏరులై పారే నాటుసారా నిర్మూలన కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఎన్నో వ్యయ, ప్రయాసలకు ఓర్చి ఆ లక్ష్యాన్నీ సాధించింది. గుడుంబా తయారీని అధికారులు అడ్డుకోవడంతో... తమ జీవనోపాధిని నాశనం చేస్తున్నారని గిరిజనులు ఆందోళనకు దిగారు. కానీ ప్రభుత్వం వారి డిమాండ్లకు ససేమిరా అంది. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపిస్తూ... గుడుంబా వల్ల జరిగే అనర్థాలను వివరించింది. ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు దీని చర్చ మనకెందుకు అనుకుంటున్నారా...! కరోనా మహమ్మారి నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​ విధించడంతో మందుబాబులకు మద్యం దొరక్క నానా తంటాలు పడుతున్నారు. ఇదే అదనుగా భావించిన వరంగల్​ గ్రామీణ జిల్లాలోని కొందరు అక్రమార్కులు మళ్లీ గుడుంబా తయారీకి తెరతీశారు.

Production of Liquor made with Jaggery
మళ్లీ జనజీవనంలోకి నాటుసారా
author img

By

Published : May 9, 2020, 5:43 PM IST

లాక్‌డౌన్ కారణంగా దాదాపు 45 రోజులపాటు మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మూడు రోజుల క్రితం తెరుచుకున్నా.. ధరలు ఎక్కువగా ఉండటంతో పేద, మధ్య తరగతికి చెందిన మందుబాబులు నాటుసారానే ఆశ్రయిస్తున్నారు. మందుబాబుల అవసరాన్ని అవకాశంగా మలుచుకొని కొందరు అక్రమార్కులు ఆదాయం వస్తుందన్న ఆశతో వరంగల్ గ్రామీణ జిల్లాలో నాటుసారా తయారీకి పూనుకుంటున్నారు.

కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ పుణ్యమా అని కొన్ని రోజులపాటు మద్యం విక్రయాలు ఆగిపోయాయి. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మద్యం మత్తులో జరిగే ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ మద్యం షాపులు తెరుచుకున్నా... ధరలు ఎక్కవగా ఉండటంతో పేదలు గుడుంబా వైపు మెగ్గుచూపుతున్నారు. ఇదే అదనుగా భావించి గ్రామాల నుంచి పట్టణాలకు నాటుసారాను యథేచ్ఛగా తరలిస్తూ కాసులు దండుకుంటున్నారు. ఆబ్కారీశాఖ అధికారులు మెరుపు దాడులు చేస్తూ గుడుంబా స్థావరాలను ధ్వంసం చేస్తున్నా... నాటుసారా రవాణాకు అడ్డుకట్ట మాత్రం పడటంలేదు.

వరంగల్ గ్రామీణ జిల్లాలో గుడుంబా తయారీ మొదలు పెట్టారు. జిల్లాలో చాలా చోట్ల నాటుసారా ఏరులై పారుతోంది. ముఖ్యంగా వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి మండలాల్లో గుడుంబా స్థావరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సంగెం మండలం గవిచర్ల గ్రామశివారు ఆశాలపల్లి ఎక్స్ రోడ్డు వద్ద రెండు ఆటోల్లో అక్రమంగా తరలిస్తోన్న 34 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని ఐదుగురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వర్ధన్నపేట పరిధిలోని తండాల్లో 25 లీటర్ల గుడుంబా, 150 లీటర్ల బెల్లం పానకం పట్టుబడింది. నాటుసారా స్థావర నిర్వాహకులు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలి ప్రెస్​మీట్​లో సీఎం కేసీఆర్‌ సైతం వరంగల్‌ గ్రామీణ జిల్లాలో నాటుసారాను అరికట్టాలని సూచించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పవచ్చు.

కరోనా పుణ్యమా అని మద్యం దుకాణాలు మూతపడటంతో ప్రశాంతంగా ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాల్లో నాటుసారా మళ్లీ అలజడి సృష్టిస్తోంది. పోలీసులు, ఆబ్కారీశాఖ అధికారులు మరింత కట్టుదిట్టంగా దాడులు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించి... నాటుసారాను అరికట్టాలని పేద, మధ్య తరగతి మహిళలు కోరుతున్నారు.

ఇదీ చూడండి : వర్ధన్నపేటలో సరి, బేసి విధానం అమలు..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.